తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన పసిడి ధర- వెండి పైపైకి

అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి క్షీణతతో బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల పసిడి ధర రూ. 50 పెరిగి.. రూ. 38, 698కి చేరింది. కిలో వెండి ధర 234 రూపాయలు పెరిగి రూ. 45,460 గా నమోదైంది.

gold
పెరిగిన పసిడి ధర- వెండి పైపైకి

By

Published : Dec 16, 2019, 4:46 PM IST

రూపాయి విలువలో క్షీణత, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారం.. 50 రూపాయలు పెరిగి రూ. 38,698గా నమోదైంది.

డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కారణంగా పసిడి విలువ పెరిగిందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ వెల్లడించారు.

వెండి ధరలోనూ పెరుగుదల

కిలో వెండి ధర.. గత ముగింపు ధరతో పోలిస్తే రూ. 234 పెరిగి 45,460గా నమోదైంది.

ఇదీ చూడండి: వృద్ధి మందగమనం అంచనాలతో మార్కెట్లు డీలా

ABOUT THE AUTHOR

...view details