తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆకాశాన్నంటిన పసిడి ధరలు... వెండికీ రెక్కలు - hike

బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి పసిడి ధర నూతన గరిష్ఠానికి చేరుకుంది. పది గ్రాముల బంగారం విలువ రూ. 38వేలకు చేరగా... కిలో వెండి రూ. 43, 670గా ముగిసింది.

బులియన్: ఆకాశాన్ని అంటిన పసిడి- వెండి ధర పైపైకి

By

Published : Aug 7, 2019, 5:56 PM IST

బంగారం ధర నూతన గరిష్ఠానికి చేరుకుంది. అమెరికా, చైనా మధ్య తాజా వాణిజ్య యుద్ధ భయాలతో మదుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం కారణంగా బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి పసిడి ధర రూ. 1113 పెరిగి... రూ. 37, 920 వద్ద స్థిరపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల ముద్రణ సంస్థల నుంచి కొనుగోళ్లు పెరిగిన కారణంగా వెండి ధర కిలోకు రూ. 650 ఎగబాకి... రూ. 43, 670కి చేరింది.

స్థానికంగా ఉన్న డిమాండ్​తో పాటు అంతర్జాతీయంగా ప్రీమియం లోహాల ధర పైకి ఎగబాకడం ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details