తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ ఊతమిచ్చినా మార్కెట్లను ముంచిన ఆర్థిక షేర్లు - స్టాక్ మార్కెట్ న్యూస్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 98, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయాయి.

Stocks closing
దేశీయ స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 14, 2020, 3:41 PM IST

Updated : Sep 14, 2020, 3:53 PM IST

లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 98 పాయింట్లు క్షీణించి 38,757 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 24 పాయింట్లు పడిపోయి 11,440కి చేరుకుంది.

ఐటీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడయినా.. బ్యాంకింగ్​ రంగంలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టపోయాయి. ఒకానొక దశలో 375 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్​ 39,230 గరిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లో..

హెచ్​సీఎల్​ టెక్ 10 శాతంపైగా లాభపడింది. టీసీఎస్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా, టైటాన్​, బజాజ్ ఆటో షేర్లు రాణించాయి.

భారతి ఎయిర్​టెల్​, బజాజ్​ ఫైనాన్స్​, ఎస్​బీఐ, కొటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, పవర్​గ్రిడ్ నష్టపోయాయి.

రూపాయి..

సోమవారం ట్రేడింగ్​లో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి డాలరుతో పోలిస్తే 73.48 వద్ద స్థిరపడింది.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలోని ప్రధాన మార్కెట్లైన హాంకాంగ్, షాంఘై, జపాన్, దక్షిణ కొరియా సూచీలు లాభపడ్డాయి.

ఇదీ చూడండి:అమెజాన్​లో లక్ష ఉద్యోగాల నియామకం

Last Updated : Sep 14, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details