తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్ల దూకుడు- లాభాల్లో ముగిసిన మార్కెట్లు - మార్కెట్​ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 254పాయింట్లు బలపడి 51,279 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 15,174 పైకి చేరింది. ఐటీ షేర్లు లాభాలను గడించాయి.

ECONOMICAL SHARES AND IT SHARES ARE IN POSITIVE NODE SENSEX AT51,200 PLUS
ఐటీ షేర్ల దూకుడు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

By

Published : Mar 10, 2021, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్​లో లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 254 పాయింట్లు బలపడి 51,279వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 76పాయింట్లు పెరిగి 15,174 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,430 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,048 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,218 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,100 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్​ ఫినాన్స్, సన్​పార్మా, టెక్​ మహేంద్ర, బజాజ్​ ఆటో, ఇన్ఫోసిస్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాలను గడించాయి.

పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, మారుతి, ఐటీసీ​, కోటక్​ బ్యాంక్​​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details