స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్లో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 584 పాయింట్లు బలపడి 51,025వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 15,098 వద్ద స్థిరపడింది.
ఆర్థిక, ఐటీ షేర్ల సానుకూలతలు మార్కెట్కు దన్నుగా నిలిచాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 51 వేల మార్కును తాకింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,111 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,396 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.