దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ కీలకమైన 50 వేల పాయింట్ల మార్క్‌ను.. నిఫ్టీ 15,000 మార్క్‌ను కోల్పోయాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ 397 పాయింట్లు పతనమైంది. చివరకు 50 వేల 395 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 101 పాయింట్లు పడిపోయి 14 వేల 929 వద్ద సెషన్‌ను ముగించింది.
బ్యాకింగ్, ఆర్థిక రంగాల్లోని షేర్ల అమ్మకాలు వెల్లువెత్తగా సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లలో చాలా సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. తాజాగా వెలువడిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ డబ్ల్యూపీఐ వరుసగా రెండో నెలా ఎగబాకింది. దీంతో మదుపరులు అమ్మకాలకు దిగారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు సూచీలపై ప్రభావం చూపాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,834 అత్యధిక స్థాయిని; 49,799 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.