వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఐదు నెలల కనిష్ఠానికి సూచీలు జారుకున్నాయి. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.
2015 ఆగస్టు 24 తర్వాత ఆ స్థాయిలో నేడు మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 1,448 పాయింట్లు కోల్పోయి 38, 297 పాయింట్లకు చేరుకుంది. 431.55 పాయింట్లు నష్టపోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ.. 11,202 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జీడీపీ ప్రభావమూ..
ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలకు తోడు నేడు విడుదల కానున్న 2019-20 మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలపై ప్రతికూల అంచనాలు.. మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
రూ.5 లక్షల కోట్లు ఆవిరి..
భారీ నష్టాలతో బీఎస్ఈ మదుపరుల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.