తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన భయాలు... 11 వేల దిగువకు నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఆగస్టు డెరివేటివ్​ల ఎక్స్​పైరీకి ముందు మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సెన్సెక్స్​ 383 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 97 పాయింట్లు క్షీణించింది. బ్యాంకింగ్ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

వెంటాడిన భయాలు... 11 వేల దిగువకు నిఫ్టీ

By

Published : Aug 29, 2019, 4:50 PM IST

Updated : Sep 28, 2019, 6:20 PM IST

అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్య భయాలు సహా ఆగస్టు డెరివేటివ్​ సిరీస్ ఎక్స్​పైరీ నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,068 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 10,948 వద్దకు చేరింది.

లాభాల్లో...

సన్‌ఫార్మా, వేదాంత, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్​, ఇన్ఫోసిస్​ షేర్లు లాభపడ్డాయి.

నష్టాల్లో...

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి.

రూపాయి...

రూపాయి విలువ స్వల్పంగా పెరిగి యూఎస్ డాలరుకు రూ.71.73గా ఉంది.

బంగారానికి రెక్కలు...

బంగారం విలువ రికార్డ్​ స్థాయిని అందుకుంది. 10 గ్రాముల బంగారం విలువ రూ.250 పెరిగి రూ. 40,220కి చేరింది.

Last Updated : Sep 28, 2019, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details