తెలంగాణ

telangana

ETV Bharat / business

7.5శాతంగా భారత్​ వృద్ధి రేటు : ప్రపంచ బ్యాంకు

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్​ వృద్ధిరేటు 7.5శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. తర్వాతి రెండేళ్లు ఇదే విధంగా వృద్ధి కొనసాగుతుందని తెలిపింది. చైనా వృద్ధి మాత్రం తిరోగమన దిశలో సాగుతుందని అంచనా వేసింది.

By

Published : Jun 5, 2019, 1:26 PM IST

Updated : Jun 5, 2019, 3:34 PM IST

ప్రపంచ బ్యాంకు

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.5శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మరో రెండేళ్లు వృద్ధి ఇదేస్థాయిలో ఉంటుందని వెల్లడించింది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు వినియోగం అధికమవడం వల్లే భారత్​లో వృద్ధి పురోగమిస్తోందని ప్రపంచ ఆర్థిక అంచనా నివేదికలో బహిర్గతపరిచింది.

తగ్గనున్న చైనా వృద్ధి

2018లో 6.6శాతంగా నమోదైన చైనా వృద్ధి రేటు 2019కి 6.2కు పడిపోతుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. 2020లో 6.1శాతానికి 2021కి మరింత క్షీణించి 6శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ కొనసాగుతుందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. 2021లో చైనా కన్నా భారత వృద్ధి రేటు 1.5శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. భారత్​లో పట్టణ వినియోగం.. వృద్ధికి సహకరిస్తుందని చెప్పింది. పారిశ్రామిక అభివృద్ధి ఆశాజనకంగానే ఉంటుందని వెల్లడించింది.

2018-19 నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్​ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇది చైనా కంటే చాలా తక్కువ. వ్యవసాయం, తయారీ రంగాల్లో భారీ క్షీణత ఏర్పడుతుందని సీఎస్​ఓ అంచనా వేసింది. అయితే, ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక కొత్త ప్రభుత్వానికి శుభవార్తలాంటిదని చెప్పొచ్చు.

ఇదీ చూడండి : గూగుల్ మ్యాప్​లో బస్సులు, రైళ్ల వివరాలు!

Last Updated : Jun 5, 2019, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details