తెలంగాణ

telangana

ETV Bharat / business

'వడ్డీ వసూలు చేస్తే మారటోరియంతో ప్రయోజనమేంటి?' - ఈఎంఐలపై వడ్డీ రద్దుపై కేంద్రం స్పందన

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్​బీఐ విధించిన మారటోరియంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వడ్డీ వసూలు చేసినప్పుడు మారటోరియంతో ఉపయోగమేంటని ప్రశ్నించింది.

sc on moratorium
వడ్డీ వసూలు గురించి కేంద్రంపై సుప్రీం సీరియస్​

By

Published : Jun 12, 2020, 12:51 PM IST

Updated : Jun 12, 2020, 1:20 PM IST

మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మారటోరియంలో వడ్డీ ఎలా వసూలు చేస్తారని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు మారటోరియం విధించి ప్రయోజనమేంటని కేంద్రాన్ని అత్యన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

ఈ విషయంపై మూడు రోజుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్​బీఐలు సంయుక్త సమావేశం నిర్వహించి.. వడ్డీ వసూలు చేయాలా వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ విషయంపై ఆర్థిక శాఖ, ఆర్​బీఐ అధికారులతో చర్చించి అఫిడవిట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్​ మెహతా కోర్టుకు తెలిపారు. ఇందుకు కాస్త సమయం కావాలని కోరారు. జూన్​ 17న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

ఇదీ చూడండి:ఉద్యోగుల్లో కరోనా భయాలకు ఇన్ఫీ సాంకేతిక పరిష్కారం!

Last Updated : Jun 12, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details