తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికాలో హోంలోన్​ వడ్డీ రేటు ఇంత తక్కువా? - మార్ట్​గేజ్ రేట్లలో భారీ తగ్గుదల

అమెరికా ఆర్థిక వ్యవస్థను కరోనా తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో.. మార్ట్​గేజ్​ రేట్లు మరోసారి భారీగా తగ్గాయి. ఈ వారంలో.. 30 ఏళ్ల ఫిక్సెడ్ గృహ రుణాల రేటు 2.71 శాతం నుంచి 2.67 శాతానికి తగ్గినట్లు మార్ట్​గేజ్ ఫినాన్స్ సంస్థ ఫ్రెడ్డీ మెక్ వెల్లడించింది.

mortgage rates fall
తగ్గిన తనఖా రేట్లు

By

Published : Dec 18, 2020, 11:08 AM IST

అమెరికా దీర్ఘకాలిక మార్ట్​గేజ్ (తనఖా) రేట్లు ఈ వారం మరోసారి రికార్డు స్థాయిలో తగ్గాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారుకోవడం ఇందుకు కారణం. తనఖా రేట్లు పడిపోవడం ఈ ఏడాది వరుసగా ఇది 15వ సారి.

మార్ట్​గేజ్​​ ఫినాన్స్ సంస్థ ఫ్రెడ్డీ మెక్​ ప్రకారం 30 ఏళ్ల ఫిక్సెడ్ గృహ రుణాల రేటు 2.71 శాతం నుంచి 2.67 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 3.73 శాతం వద్ద ఉంది. 15 ఏళ్ల ఫిక్సెడ్ రుణాల రేట్లు కూడా 2.26 శాతం నుంచి 2.21 శాతానికి పడిపోయినట్లు తెలిపింది ఫ్రెడ్డీ మెక్.

ఇదీ చూడండి:''హ్యాక్'​తో తీవ్ర ముప్పు.. తస్మాత్​ జాగ్రత్త'

ABOUT THE AUTHOR

...view details