తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగాలు సృష్టించాం..అందుకే నిరనసల్లేవ్​: అరుణ్​జైట్లీ - economic growth

గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి నిరసనలు లేకపోవటమే ఎన్డీఏ కూటమి ఉద్యోగాలు సృష్టించిదనటానికి నిదర్శనమని అన్నారు అరుణ్​జైట్లీ.

అరుణ్​జైట్లీ

By

Published : Feb 3, 2019, 7:20 PM IST

'ఉద్యోగాలు లేని ఆర్థికవృద్ధి' అనే విమర్శలను ఖండించారు కేంద్ర మంత్రి అరుణ్​జైట్లీ. భాజపా అధికారంలోకి వచ్చాక లక్షలాది ఉద్యోగాలను సృష్టించామని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సామాజిక, రాజకీయ ఆందోళనలు జరగకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు.

న్యూయార్క్​లో చికిత్స తీసుకుంటున్న కేంద్ర మంత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్​ సాధారణ బడ్జెట్​ కాదని, ఇదొక రిపోర్టు కార్డులాంటిదని అన్నారు.

2017-18 సంబంధించి లీకైన అధికారిక నివేదికలో నిరుద్యోగ రేటు 45 గరిష్ఠానికి చేరిందని వెల్లడైంది. దీనిపై వివాదం కొనసాగుతున్నందున స్పందించారు జైట్లీ. నోట్ల రద్దు అంశంపైనా మాట్లాడారు.
నోట్ల రద్దు తర్వాత జీడీపీ పెరిగిందని, ఇది 2017-18 సవరించిన అంచనాలతో స్పష్టమైందని అన్నారు అరుణ్​జైట్లీ.

"నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి పెరుగుతుందని నేను మొదటి నుంచి చెప్పాను. నోట్ల రద్దు ప్రభావం జీడీపీపై ఎలా ఉంటుందో తెలిపే సిద్ధాంతాలు లేవు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ 2 శాతం వృద్ధి పడిపోతుందని అభిప్రాయపడ్డారు. దీన్నే అందరూ నమ్మారు. " - అరుణ్​జైట్లీ

బ్యాంకుల్లో జమ అయిన ధనం మ్యూచువల్​ ఫండ్లలోకి, అక్కడి నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి సంస్థలు, వాహనాలు కొనుగోలు, మూలధన వ్యయానికి మళ్లాయని జైట్లీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details