ప్రభుత్వ రంగ, అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 30లోపు పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అప్పటిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
ముఖ్యంగా పాన్ ఇన్యాక్టవ్గా మారుతుందని.. ఫలితంగా నగదు లావాదేవీలు జరపడంలో ఇబ్బందులు తలెత్తుతాయని వివరించింది ఎస్బీఐ.
ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961 సెక్షన్ 139ఏఏ ప్రకారం.. భారతీయ పౌరులు ఎవరికైతే పాన్ కార్డ్ ఉంటుందో వారంతా.. తమ ఆధార్ వివరాలు ఆదాయాపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు ముందే ఆదాయపు శాఖ.. ఈ దీనిని తప్పని సరి చేసినప్పటికీ కరోనా సహా పలు ఇతర కారణాలతో ఇందుకు గడువు పెంచుతూ వచ్చింది.
పాన్-ఆధార్ లింక్ చేయడం ఎలా?
- ఆదాయపన్ను శాఖ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్ లేదా ఎస్ఎంఎస్ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
- ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్సైట్లో 'Link Aadhaar' విభాగంలో ఇది లభిస్తుంది. పాన్, ఆధార్ నెంబర్లు.. ఆధార్ కార్డు ప్రకారం పేరు వంటి వివరాలను పొందుపరచాల్పి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దీని ద్వారా ప్రమాణీకరణ పూర్తి అవుతుంది.
- ఎస్ఎంఎస్ ద్వారా అయితే.. 567678/56161కు UIDPAN<12-digit Aadhaar> <10-digit PAN> అని మెసేజ్ చేయాలి.
- పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఈ రెండింటిలోనూ.. మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు ఒకేలా ఉండాలి.
- ఒకవేళ ఆధార్ డేటాలో ఉన్న పేరుకు మీరు ఇచ్చిన పేరుకు మధ్య చిన్న వ్యత్యాసం ఉన్నా ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.
- ఒకవేళ ఆధార్ కార్డులోని పేరుకు, పాన్ నెంబరులోని పేరు పూర్తిగా వేరుగా ఉంటే అనుసంధానం కాదు. ఏ కార్డులో తప్పుగా పేరు నమోదు అయ్యిందో ఆ కార్డును సరిచేసుకుని అప్పుడు అనుసంధానించాలి.
ఇవీ చదవండి: