రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్)కు సంబంధించి వినియోగదారులకు శుభవార్త చెప్పింది భారతీయ రిజర్వు బ్యాంక్. ఆర్టీజీఎస్ సేవలు డిసెంబర్ నుంచి 24x7 అందుటులో ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. భారీ మొత్తాల చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
ఏమిటి ఈ ఆర్టీజీఎస్..