పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. జులైలో 5.33 శాతానికి దిగివచ్చింది. గతేడాది జులైలో 5.98 శాతంగా నమోదైంది. అయితే, పారిశ్రామిక కార్మికులకు సంబంధించి జూన్లో ద్రవ్యోల్బణం 5.06 శాతంగా ఉంది.
కొన్ని ఆహార పదార్థాలు చౌక అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమైందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జులైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.38 శాతంగా ఉండగా.. గత నెలలో 5.49 శాతం నమోదైంది. 2019 జులైలో ఇది 4.78 శాతంగా ఉంది.