ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలతో జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కిస్తారు.
వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2019 జూన్లో 3.18 శాతంగా ఉంది.
ఈ జూన్లో ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతానికి పెరిగినట్లు సీపీఐ డేటా సూచిస్తోంది.
లాక్డౌన్ ఆంక్షల దృష్ట్యా పరిమిత మార్కెట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ద్రవ్యోల్బణ గణాంకాలు లెక్కించామని జాతీయ గణాంకాల విభాగం వెల్లడించింది. రాష్ట్రస్థాయిలో మెరుగైన అంచనాలను రూపొందించేందుకు తగిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ డేటా లేదని పేర్కొంది.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లోనూ తక్కువ మార్కెట్ల ద్వారా సేకరించిన డేటాను విడుదల చేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:'మే'లో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం.. -3.21 శాతంగా నమోదు