దేశ వృద్ధిరేటు క్షీణత, ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండటం వంటి పరిణామాల తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సిద్ధమైంది రిజర్వు బ్యాంకు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ విధాన సమీక్ష జరగనుంది.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఈ నెల 6న వెల్లడించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఈ సారి రెపో నిర్ణయం ఎలా ఉండొచ్చు..
ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం, పలు దేశీయ, అంతర్జాతీయ కారణాలతో జీడీపీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో పక్క 2019 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతం వద్ద ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రధానంగా ఉల్లి, టమాటా ధరలు భారీగా పెరగటం ఇందుకు కారణం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారీ రెపో రేటులో మార్పులు ఉండకపోవచ్చని డీబీఎస్ గ్రూప్ అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: '6 నెలల్లో రూ.1.13 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు'