తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ తగ్గింపేనా..? నేడే ఆర్బీఐ ప్రకటన

ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని నేడు ప్రకటించనుంది రిజర్వు బ్యాంకు. కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

By

Published : Apr 4, 2019, 5:27 AM IST

Updated : Apr 4, 2019, 6:46 AM IST

మళ్లీ తగ్గింపేనా...? నేడే ఆర్బీఐ ప్రకటన

2019-20లో మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) నేటి ఉదయం 11.45 గంటలకు ప్రకటించనుంది. ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ మూడు రోజుల భేటీ మంగళవారం ప్రారంభమైంది. ఈ కమిటీలో ముగ్గురు రిజర్వు బ్యాంకు అధికారులు కాగా, మరో ముగ్గురు ప్రభుత్వం నామినేట్​ చేసిన వారు ఉన్నారు.

వడ్డీరేట్ల సమీక్షకు ధరల పెరుగుదలను ప్రతిపాదికగా తీసుకుంటుంది రిజర్వు బ్యాంకు. ద్రవ్యోల్బణం 4శాతం లోపు ఉండాలన్నది లక్ష్యం. ధరల సూచీ ఈ స్థాయిలోనే ఉండటం సహా ఆర్థిక వృద్ధిపై భయాల నేపథ్యంలో రెపోరేటు లాంటి కీలక వడ్డీరేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

క్రితం సమీక్ష తీరిది..

2019 ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో 8 నెలల విరామం అనంతరం వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ.

రెపోరేటు అంటే?

కేంద్ర బ్యాంకైన రిజర్వు బ్యాంకు దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటు అంటారు. అదే సమయంలో వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే రుణంపై ఇచ్చే వడ్డీ రేటును రివర్స్​ రెపోరేటు అంటారు.

ఇదీ చూడండి:మళ్లీ తగ్గనున్న వడ్డీ రేట్లు..!

Last Updated : Apr 4, 2019, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details