సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎఈలకు) జూన్ 1 నుంచి 9 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంకులు రూ.12,200.65 కోట్ల రుణాలు అందించాయని చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక లభ్యత పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా..
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్ భారత్' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షలు కేటాయించారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు జూన్ 1 నుంచి జూన్ 9 వరకు రూ.24,260.65 కోట్ల రూపాయలను మంజూరు చేశాయి. ఇందులో రూ.12,200.65 కోట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.