చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తొలిరోజు పర్యటనలో భాగంగా ఆయనతో ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిపారు. చైనాతో భారత్కు ఉన్న వాణిజ్య లోటు అంశంపై జిన్పింగ్తో జరిగిన రెండో అనధికారిక సమావేశంలో మోదీ చర్చించినట్లు.. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వెల్లడించారు. మామల్లపురంలో ఇరు దేశాధినేతలు.. తమ దేశాల దృక్పథాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించారని తెలిపారు.
"మోదీ, జిన్పింగ్ల మధ్య ముఖ్యంగా వాణిజ్య, ఆర్థిక పరమైన చర్చలు సాగాయి. ఇరుదేశాలు ప్రోత్సహించే పెట్టుబడి రంగాలను గుర్తించడం.. వాణిజ్య పరిమాణం, విలువను పెంచుకునే అంశాలపైనా చర్చలు సాగాయి. ఇందులో వాణిజ్య లోటును తగ్గించే అంశాలూ ఉన్నాయి."
-విజయ్ గోఖలే, విదేశీ వ్యవహారాల కార్యదర్శి