గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. వరుసగా రెండో నెలలో ధరను పెంచుతూ ఆయిల్ కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి. తాజాగా ఒక్కో సిలిండర్‌పై రూ.25 పెంచుతున్నట్లు వెల్లడించాయి.
ఫలితంగా సబ్సిడీతో కూడిన 14.2 కేజీల సిలిండర్ ధర దిల్లీలో రూ.859కి పెరిగింది. కాగా, ముంబయిలో రూ.859.5, కోల్‌కతాలో రూ.886, చెన్నైలో రూ.875.50కి చేరింది. ఈ ధరలు ఆగస్టు 17 నుంచే అమలులోకి వచ్చాయని ఆయిల్ సంస్థలు తెలిపాయి.
పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని...
సబ్సిడీ సిలిండర్ ధరను జులై 1నే రూ.25.50 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతే మొత్తంలో.. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ రేట్లు ఆగస్టు 1న పెరిగాయి. ఈ సమయంలోనే సబ్సిడీ సిలిండర్ల ధరను సైతం పెంచాల్సి ఉన్నప్పటికీ.. పార్లమెంట్ సమావేశాల వల్ల వెనకడుగు వేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతాయని అప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించలేదని పేర్కొన్నాయి.
రేట్ల పెంపు ఇలా...