దేశంలో పెట్రోల్ ధరల పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.37, డీజిల్ లీటరు ధర 77.06కి ఎగబాకింది.
13వ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు - Liter petrol price
దేశంలో పెట్రోల్ ధరలు పదమూడు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు పెరిగింది.
పదమూడో రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు
వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆ మేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.11, డీజిల్‌పై రూ.7.67 పైసలు పెరిగింది.
ఇదీ చూడండి:ఆ పరిస్థితి రాకముందే ఉద్దీపన చర్యలు పట్టాలెక్కాలి!