ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలను దిగువకు సవరించింది ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్. కరోనా రెండో దశ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో 2021 వృద్ధి రేటు 10.2 శాతానికి పరిమితమవచ్చని తాజా నివేదికలో పేర్కొంది. ఇంతకు ముందు నివేదికలో ఈ అంచనా 11.8 శాతంగా ఉండటం గమనార్హం.
'దేశ వైద్య కేటాయింపుల భారం పెరగటం, టీకాలు వేయడంలో ఆశించినంత వేగం లేకపోవడం. కొవిడ్-19 నియంత్రణకు సరైన దిశలో ప్రభుత్వం తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపించకపోవడం' వంటివి కూడా వృద్ధి రేటు అంచనాలను తగ్గించేందుకు కారణంగా పేర్కొంది.