భారతదేశంలో ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య భారీగా పెరగనుంది. ఇది 2020 కల్లా 50 కోట్లకు చేరుతుందని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అంచనా వేసింది. గూగుల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం... మూడో వంతు సెర్చ్‌లు వినోదాత్మక వీడియోలకు సంబంధించినవే.
గత రెండు సంవత్సరాల్లో జీవనశైలి, విద్య, వ్యాపారానికి సంబంధించిన సెర్చింగ్ 1.5 నుంచి 3 రెట్లు పెరిగింది.
వినియోగదారులు సమాచారం సేకరించటం, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవటాన్ని ఆన్లైన్ వీడియోలు మార్చుతున్నాయి. కార్లు కొనాలనుకునే 80 శాతం మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. -గూగుల్ నివేదిక
భారతీయ భాషలే కావాలి