తెలంగాణ

telangana

ETV Bharat / business

నమో-2.0 సర్కార్​కు ఆర్థిక సవాళ్ల స్వాగతం!

భారీ మెజారిటీతో మరోసారి అధికార పీఠమెక్కనున్న మోదీ ప్రభుత్వానికి ఆర్థికపరంగా అనేక సవాళ్లు ఎదురవ్వనున్నట్లు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ సమస్యలు, నిరుద్యోగం మోదీకి ప్రధానంగా ఛాలెంజ్​ విసిరే అంశాలుగా పేర్కొంటున్నారు.

By

Published : May 25, 2019, 11:31 AM IST

మోదీకి ఆర్థికసవాళ్ల స్వాగతం

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన ప్రధాని మోదీకి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నట్లు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలో 6వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్​ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగ కల్పన, ప్రైవేటు పెట్టుబడుల ప్రోత్సాహం, బ్యాంకింగ్​ రంగానికి మొండి బకాయిల విముక్తి వంటివి కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్యలని నిపుణులు అంటున్నారు.

వ్యవసాయ రంగం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపరమైన సమస్యలున్నప్పటికీ ఎన్డీఏ 348 సీట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. యూపీఏను 82 స్థానాలకే పరిమితం చేసింది.

భూ, కార్మిక చట్టాల సంస్కరణ..

కంపెనీలకు భూ కేటాయింపుల ప్రక్రియను సులభతరం చేయడం సహా కార్మిక చట్టాల్లో మార్పులు తేవాలని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు కరెంట్ ఖాతా లోటును అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఆర్థిక సంస్కరణల ప్రయోజనాలు...

"ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ప్రయోజనాలను అందించే దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా జీఎస్​టీ, దివాలా ప్రక్రియల ప్రయోజనాలు అందించడం వంటివి మోదీ ప్రభుత్వం ముందున్న తక్షణ సవాళ్లు. రెండోది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్యలను పరిష్కరించి.. వాటి కార్యకలాపాల సామర్థ్యాలను పెంచడం. బ్యాంకింగేతర ఆర్థిక రంగాల రుణ భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది."
-రోచీ, ప్రధాన ఆర్థికవేత్త, ఎస్​ & పీ గ్లోబల్ రేటింగ్స్​ (ఆసియా-పసిఫిక్​)

చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని భారత్​ తనకు అనుకూలంగా మార్చుకుని ఎగుమతుల్లో వృద్ధి సాధించవచ్చని రోచీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులకు ప్రోత్సాహం..

"కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం అందించడం. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ఆర్థిక పరంగా చూస్తే గత రెండు ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించింది. అవి అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. వచ్చే నెలలో మరోసారి తగ్గించే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్​ను ప్రవేశపెట్టే ముందే పెట్టుబడుల ప్రోత్సాహక చర్యలు ప్రారంభించాలి."
- డీకే శ్రీవాస్తవ, ప్రధాన పాలసీ సలహాదారు, ఎర్నెస్ట్​ & యంగ్

ABOUT THE AUTHOR

...view details