ప్రపంచంలో వేగాంగా అభివృద్ధి చెందుతున్న 'ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ల'లో భారత రాజధాని దిల్లీ 9వ స్థానాన్ని దక్కించుకుంది. గతంతో పోలిస్తే దిల్లీ ఒక స్థానం మెరుగుపడింది. ఈ జాబితాలో రష్యా రాజధాని మాస్కో ప్రథమ స్థానంలో నిలిచింది.
ప్రపంచ ప్రఖ్యాత స్థిరాస్థి రంగ సంస్థ 'నైట్ ఫ్రాంక్' 2019 మూడో త్రైమాసిక 'ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్'ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 45 ప్రధాన నగరాల్లో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలను స్థానిక మారకాల ఆధారంగా గమనిస్తూ.. ఈ ర్యాంకులను ప్రకటించింది.
- ఈ జాబితాలో బెంగళూరు.. గతంతో పోలిస్తే ఐదు స్థానాలు తగ్గి 20వ స్థానానికి చేరింది.
- దేశ వాణిజ్య రాజధాని ముంబయి.. నాలుగు స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది.