మధ్యంతర బడ్జెట్ తో బీమా రంగం పరుగులు - insurance
భాజపా ప్రవేశపెట్టిన మద్యంతర బడ్జెట్లో బీమా రంగానికి ఊతం ఇచ్చేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదు లక్షలకు పన్ను రిబేట్ మధ్య తరగతి వర్గాలకు బీమా రంగం దగ్గరవుతుందని అంటున్నారు.
insurence
insurence
"మధ్యంతర బడ్జెట్ పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న పేదలకు మేలు చేసే విధంగా ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచే పథకాలు, మధ్యతరగతి వారికి పన్ను భారాన్ని తగ్గిండం, ఒక లక్ష డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేయండం లాంటి పథకాలతో బీమా రంగం పుంజుకుంటుంది"
- భార్గవ్ దాస్గుప్త, సీఈఓ, ఐసీఐసీఐ లామ్బార్డ్
ప్రభుత్వం ఆయూష్మాన్ భారత్ పై దృష్టి పెట్టడంతో ఆరోగ్య బీమా రంగానికి ఎంతో మేలు చేస్తుందని బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్ష్యూరెనస్ సీఈఓ తపన్ సంఘెల్ అన్నారు.