పారిశ్రామిక కార్మికులు- వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) నూతన సిరీస్‌తో.. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికుల జీతాల్లో పెరుగుదల ఉండదని స్పష్టం చేసింది కార్మిక మంత్రిత్వశాఖ. ఉద్యోగులకు ఇచ్చే డీఏ పెరుగుతుందన్న మీడియా కథనాలను కొట్టిపారేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం(డీఏ) లెక్కించడానికి సీపీఐ-ఐడబ్ల్యూ ఉపయోగపడుతుంది.
కొత్తగా..
అక్టోబర్ 21న నూతన 'సీపీఐ-ఐడబ్ల్యూ' సిరీస్‌ను విడుదల చేయనుంది కేంద్రం. ఇప్పటివరకు ఇందులో విద్య, ఆరోగ్యం, ఆహారం వంటి 200 అంశాలను పరిగణనలోకి తీసుకోగా.. తాజాగా వాటి సంఖ్య 300కు పెంచనున్నారు. దాదాపు 90 ప్రాంతాల్లోని మార్కెట్ల లెక్కలను తీసుకొని సీపీఐ-ఐడబ్ల్యూ లెక్కగడతారు. అంతేకాకుండా ఇప్పటివరకు డీఏ లెక్కించడానికి 2001 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోగా.. ఇకపై 2016 ఆధారం చేసుకోనున్నారు.
ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన బంగారం ధర- 10గ్రాములు ఎంతంటే?