ఈ ఏడాది జనవరిలో దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) సుమారు 2 శాతం మేర వృద్ధి సాధించింది. తయారీ రంగంలో మందగమనం ఉన్నప్పటికీ కొన్ని కీలక రంగాల సానుకూలతలతో వృద్ధి నమోదైంది.
గతేడాది 2019 జనవరిలో ఐఐపీ 1.6 శాతంగా నమోదైంది.
ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం..
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజాగా పారిశ్రామికోత్పత్తి ఫలితాలను విడుదల చేసింది. ఈ జనవరిలో తయారీ రంగం వృద్ధి 1.5 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయానికి వృద్ధి 1.3 శాతంగా ఉంది.
విద్యుత్ ఉత్పాదన సుమారు 3.1 శాతం మేర వృద్ధి సాధించింది. 2019 జనవరిలో విద్యుత్తు రంగం కేవలం 0.9 శాతంగానే వృద్ధి నమోదు చేసింది.
2020, జనవరిలో గనుల రంగంలో అత్యధికంగా వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 3.8గా ఉన్న వృద్ధి ఈ జనవరిలో 4.4 శాతానికి చేరుకుంది.
2019,ఏప్రిల్-2020 జనవరి సమయంలో ఐఐపీ వృద్ధి రేటు సుమారు 0.5 శాతం మేర క్షీణించింది. 2018-19 సమయంలో అది 4.4 శాతంగా ఉంది.
జనవరిలో పారిశ్రామికోత్పత్తి ఇలా ఇదీ చూడండి: కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్ల 'లెక్కలు' తారుమారు