తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్చిలో భారీగా క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి - పారిశ్రామిక ఉత్పత్తి సూచీ

భారత ఆర్థిక వ్యవస్థపై లాక్​డౌన్ తీవ్ర ప్రభావం చూపినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. మార్చి నెలలో పారిశ్రమిక ఉత్పత్తి సూచీ భారీగా పతనమైంది. గతేడాది మార్చిలో 2.7 శాతం పెరిగిన ఉత్పత్తి.. 2020 మార్చిలో 16.7 శాతం క్షీణించింది.

Industrial production falls 16.7% in March
మార్చిలో పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి

By

Published : May 12, 2020, 7:11 PM IST

లాక్​డౌన్ కారణంగా దేశంలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 16.7 శాతం క్షీణించినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. గతేడాది ఇదే సమయంలో(2019 మార్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 2.7 శాతం పెరిగింది.

మైనింగ్, తయారీ, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం పడటం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించినట్లు తెలుస్తోంది. జాతీయ గణాంక సంస్థ వివరాల ప్రకారం.. 2019 మార్చిలో 3.1 శాతం వృద్ధి కనబర్చిన తయారీ రంగం... 2020 మార్చిలో 20.6 శాతం క్షీణించింది. గతేడాది మార్చిలో విద్యుత్ ఉత్పత్తి 2.2 శాతం పెరగ్గా... 2020 మార్చిలో ఉత్పత్తి 6.8 శాతం తగ్గిపోయింది.

2018-19లో ఐఐపీ 3.8 శాతం వృద్ధి చెందగా... 2019-20 సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 0.7 శాతానికి పడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details