అక్టోబర్లో భారత ఎగుమతులు 5.4 శాతం తగ్గి.. 24.82 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, లెదర్ విభాగాల్లో షిప్మెంట్లు తగ్గిన కారణంగా ఈ క్షీణత నమోదైనట్లు మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ.
ఇదే సమయానికి దేశ దిగుమతులు కూడా భారీగా 11.56 శాతం తగ్గి.. 33.6 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది.