తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఎగుమతులపై దృష్టిసారిస్తేనే మరింత వృద్ధి'

భారత​ వృద్ధి గత ఐదేళ్లలో సానుకూలంగానే ఉన్నట్లు ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రధాన ఆర్థిక వేత్త హన్స్​టిమ్మర్ అన్నారు. ఇదంతా దేశీయ డిమాండు కారణంగానే జరిగిందని తెలిపారు. వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఎగుమతులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

By

Published : Apr 8, 2019, 5:00 PM IST

ప్రపంచబ్యాంకు

గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వృద్ధి దేశీయ డిమాండు కారణంగానే జరిగిందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రధాన ఆర్థికవేత్త హన్స్​ టిమ్మర్​ అన్నారు. భారత్​ సామర్థ్యంలో మూడింట ఒక వంతు ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం ప్రధానంగా ఎగుమతుల ద్వారా జరిగే అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు టిమ్మర్​.

భారత్​లో వ్వాపారాలను సరళీకృతం చేసే ప్రయత్నాలను అభినందిస్తూ... ఇలాంటి నిర్ణయాలే ఇతర దేశాలతో పోటీలో ముందుంచుతాయని అన్నారు.

"అదే సమయంలో గత రెండేళ్లుగా కరెంట్ ఖాతా లోటు పెరిగింది. వృద్ధి ప్రధానంగా వాణిజ్య రహిత రంగాల నుంచి వచ్చిందని అర్థం. అంటే దేశీయ రంగాల నుంచే. ఫలితంగా మార్కెట్లో ఎగుమతులు చేయడం కష్టతరమైంది" -టిమ్మర్

గత ఐదేళ్లలో భారత్​ సమగ్ర అభివృద్ధి దేశీయ డిమాండు కారణంగానే జరిగింది. దీని ఫలితంగా దిగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. ఎగుమతుల్లో 5-6 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.

కొన్ని నెలలగా ఈ ఎగుమతులు పెరిగినా... దేశ సరిహద్దుల్లో నెలకొన్న అనిశ్చితులు అవరోధంగా మారాయని టిమ్మర్​​ అన్నారు.

వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) వంటి నిర్ణయాలు మంచి పరిణామంగా టిమ్మర్​​ పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రాల మధ్య వాణిజ్యం సులభతరమైందన్నారు. ఇతర దేశాలతో కూడా ఇలాంటి వ్యాపారమే సాగిస్తే మంచి ఫలితాలుంటాయన్నారు టిమ్మర్​.

భారత్​ జీడీపీలో ఎగుమతుల వాటా కేవలం 10శాతం మాత్రమే ఉందని తెలిపారు టిమ్మర్. దక్షిణాసియాలో మంచి అవకాశంగా ఉన్న చైనా లక్ష్యంగా ఎగుమతులు పెంపొందించుకోవాలని సూచించారు. చైనాను చూసి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారాయన.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details