తెలంగాణ

telangana

ETV Bharat / business

విహారి: విదేశాల కన్నా దేశీ యాత్రలకే మొగ్గు

వేసవి పర్యటనకు విదేశాలకన్నా దేశీయ ప్రయాణాలకే మొగ్గుచూపుతున్నారు భారతీయులు. తక్కువ బడ్జెట్​లో ఎక్కవ అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం.

By

Published : May 2, 2019, 3:03 PM IST

విహారి

వేసవి అంటే ఎక్కువగా పర్యటనకు ప్రాధాన్యం ఇస్తుంటారంతా. స్తోమతను బట్టి ఎక్కడికి వెళ్లాలా అని ప్రణాళికలు వేసుకుంటారు. బాగా డబ్బున్నవాళ్లు విదేశాలకు వేళ్తే... మధ్య తరగతి వారు దేశీయ పర్యటన చేస్తుంటారు.

ఈ ఏడాది అందుకు భిన్నంగా అత్యధిక భారతీయులు దేశీయ పర్యటనకే మొగ్గుచూపుతున్నారు. ఆన్​లైన్​ ట్రావెల్​ పోర్టల్​ 'యాత్ర డాట్​కామ్'​ 5,100 మందిపై చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వారిలో 68శాతం మంది దేశీయ పర్యటనకే ఆసక్తి చూపారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది తమ పర్యటన కోసం రూ.10,000-రూ.25,000 ఖర్చు చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది. ఈ బడ్జెట్​లో దేశీయంగా పర్యటించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కారణంగా వారు దేశీయ పర్యటనపై ఆసక్తి చూపుతున్నారు.

దేశంలో పెద్దగా ప్రాచుర్యం పొందని ప్రాంతాలకు వెళ్లేందుకు పర్యటకులు ఇటీవలి కాలంలో ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి కూడా దేశీయ పర్యటన వృద్ధికి దోహదం చేస్తున్నట్లు యాత్ర డాట్​కామ్​ సీఓఓ శరత్​ దాల్ తెలిపారు.

ఆఫర్లతో ముందస్తు బుకింగ్​

ప్రయాణాలు చేసేకన్నా ముందు 74 శాతం మంది ఆన్​లైన్​ రివ్యూల ఆధారంగా తమ వసతిని ఎంచుకుంటున్నారు. ఆఫర్లను బట్టి ప్రయాణానికి 3 నెలలు మొదలుకుని 15 రోజుల ముందు నుంచే వసతి, విమాన టికెట్లు బుక్​ చేసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.

ABOUT THE AUTHOR

...view details