తెలంగాణ

telangana

ETV Bharat / business

PMI Index: ఆగస్టులో సేవా రంగం భళా..

ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ లేని విధంగా సేవ రంగ కార్యకలాపాలు (Indian services activity) భారీగా పుంజుకున్నాయి. దీనితో ఆగస్టులో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్​ ఇండెక్స్ (PMI Index) 56.7కు పెరిగినట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ పేర్కొంది.

Service sector PMI
సేవా రంగ పీఎంఐ

By

Published : Sep 3, 2021, 12:32 PM IST

దేశీయ సేవా రంగం (Indian services activity) ఆగస్టులో భారీగా పుంజుకుంది. కొత్త ప్రాజెక్ట్​లు మొదలు కావడం, డిమాండ్ పెరగటం వంటివి ఇందుకు కలిసొచ్చినట్లు ఐహెచ్​ఎస్ మార్కిట్​ నెలవారీ నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం..

ఆగస్టులో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI Index) 56.7గా నమోదైంది. ఇది జులైలో 45.4 వద్ద ఉండటం గమనార్హం. ఏడాదిన్నర కాలంలో వృద్ధి రేటు ఈ స్థాయిలో పుంజుకోవడం ఇదే ప్రథమం.

సాధారణంగా పీఎంఐ 50కి పైన ఉంటే సానుకూలంగా ఉన్నట్లు.. అంతకన్నా దిగువన ఉంటే క్షీణత దశలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్ వేగం(Corona Vaccination), సేవా రంగంలో కార్యకలాపాలు తిరిగి భారీ స్థాయిలో ప్రారంభమవటం వంటి అంశాలు పీఎంఐ(PMI India) ఈ స్థాయిలో పెరిగేందుకు కారణమైనట్లు ఐహెచ్​ఎస్ మార్కిట్​ పేర్కొంది. అయినప్పటికీ సేవా రంగ ఎగుమతులు మాత్రం ఆగస్టులోనూ క్షీణతను నమోదు చేసినట్లు నివేదిక వివరించింది. ముఖ్యంగా ప్రయాణాలపై ఆంక్షలు, ఇతర దేశాల్లో కరోనా భయాల వంటివి ఇందుకు కారణంగా తెలిపింది.

ఈ ఏడాది సానుకూల వృద్ధి రేటు నమోదవుతుందనే అంచనాలు వస్తున్నప్పటికీ.. ఆగస్టులోను ఉద్యోగాల కోతలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఈ జనవరితో పోలిస్తే.. ఇది అత్యల్పంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికీ చాలా కంపెనీలు ప్రస్తుత డిమాండ్​కు తగ్గ కార్మిక శక్తి తమకు ఉన్నట్లు ప్రకటించాయని వివరించింది.

ఇదీ చదవండి:30 వేల కోట్ల డాలర్లకు టాటా గ్రూప్​ మార్కెట్​ విలువ

ABOUT THE AUTHOR

...view details