తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థికానికి వ్యవ'సాయం'- జీడీపీ V ఆకారపు రికవరీ

దేశ ఆర్థిక వ్యవస్థ V-ఆకారపు రికవరీ సాధిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక వెల్లడించింది. ఆర్థిక శాఖ రికవరీకి వ్యవసాయ, నిర్మాణ, తయారీ రంగాలు ప్రధానంగా దన్నుగా నిలుస్తున్నాయని తెలిపింది.

Indian economy in V-shaped recovery
వీ ఆకారపు రికవరీలో భారత్

By

Published : Dec 3, 2020, 5:07 PM IST

కరోనా నుంచి భారత ఆర్థిక వ్యవస్థ V-ఆకారపు రికవరీని నమోదు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణించిన దేశ జీడీపీ.. రెండో త్రైమాసికంలో -7.5 శాతానికి పరిమితం కావడాన్ని ఊటంకిస్తూ ఈ విషయాన్ని తెలిపింది ఆర్థిక శాఖ నివేదిక.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు -7.5 శాతంగా నమోదైనా.. క్యూ1తో పోలిస్తే మాత్రం 23 శాతం సానుకూల వృద్ధి రేటు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. లాక్​డౌన్​ సడలింపులు, ఆత్మనిర్భర్​ భారత్ ప్యాకేజీ వంటివి ఇందుకు దోహదం చేసినట్లు వివరించింది.

వ్యవ'సాయం'

ఆర్థిక వ్యవస్థ రికవరీకి వ్యవసాయ రంగం ప్రధానంగా దన్నుగా నిలిచినట్లు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. నిర్మాణ, తయారీ రంగాల సానుకూలతలు సహా లాజిస్టింగ్​, కమ్యూనికేషన్​ ద్వారా సేవా రంగం కూడా ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమందించినట్లు పేర్కొంది.

ఇవీ చూడండి:

వరుసగా రెండో నెల సేవా రంగం సానుకూలం

'నాల్గో త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటు'

ABOUT THE AUTHOR

...view details