తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.70 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై నిపుణుల హర్షం

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఎగుమతులు, స్థిరాస్తి రంగాలను ప్రోత్సహించేలా రూ.70 వేల కోట్లతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించడాన్ని స్వాగతించారు ఆర్థిక, వ్యాపార రంగ నిపుణులు. ఈ చర్యలు పలు రంగాలకు ఉపకరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Sep 15, 2019, 7:04 AM IST

Updated : Sep 30, 2019, 3:57 PM IST

రూ.70 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై నిపుణుల హర్షం

రూ.70 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై నిపుణుల హర్షం

నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మూడో విడత ఉద్దీపన చర్యల్లో భాగంగా ఎగుమతులు, స్థిరాస్తి రంగాలకు ప్రత్యేక నిధి (స్ట్రెస్డ్‌ అసెట్‌ ఫండ్‌)తో కలిపి రూ.70,000 కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ఈ చర్యలు ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహమిస్తాయని ఆర్థిక, వ్యాపార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

కేంద్రం ప్రకటిస్తోన్న ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలను ఆయా రంగాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆశించిన మార్పు వస్తుందని ప్రముఖ ఆర్థిక నిపుణులు నరసింహ మూర్తి చెప్పారు. పలు రంగాలను గాడిలో పెట్టేందుకు ఈ వరస చర్యలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డిసెంబర్ కల్లా ఉద్దీపనల ప్రభావం కనిపిస్తుందని.. ఈ క్రమంలో ఆయా రంగాలు పూర్తిస్థాయిలో రాణించాలన్నారు.

''కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలు బాగున్నాయి. సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలొస్తాయి. వీటిని అర్థం చేసుకుని అమలు చేయడం కొంచెం కష్టం. చాలా మందికి వీటి ప్రయోజనాలు తెలియవు. ఎగుమతులకు సంబంధించి ఈసీజీసీ కవరేజి, ప్రియారిటీ సెక్టార్ల లెండింగ్, వేగవంత ప్రక్రియ, ఎగుమతి దారులకు ప్రయోజనం చేకూర్చడం వంటి అంశాలు ఉపయోగకరం. హస్తకళ, వస్త్ర పరిశ్రమలకు ఇవి ఉపకరిస్తాయి.''

-నరసింహ మూర్తి, బ్యాంకింగ్​, ఆర్థిక రంగ నిపుణులు.

తొలిసారి కాబట్టి అంగీకారమే...

ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిర్మాణ రంగానికి కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు భారత స్థిరాస్తి అభివృద్ధి సమాఖ్య(క్రెడాయ్​) మాజీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి.

''రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయం. దీనికి ప్రభుత్వంతో పాటు బయటి పెట్టుబడిదారులు కూడా అంతే మొత్తంలో నిధులు సమకూరుస్తారు, దీనిని నిపుణులు నిర్వహిస్తారు. నిధులు లేక దేశవ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన అందుబాటు, మధ్య ఆదాయ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది ఉపకరిస్తుందని విత్తమంత్రి తెలిపారు. దేశంలో మొదటి సారి ఈ చర్యలు ప్రవేశపెట్టారు కాబట్టి స్వాగతిస్తున్నాం.''

-శేఖర్ రెడ్డి, క్రెడాయ్​ మాజీ అధ్యక్షులు.

ఇదీ చూడండి: రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

Last Updated : Sep 30, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details