తెలంగాణ

telangana

ETV Bharat / business

చర్చల నేపథ్యంలో సుంకాలపై గడువు పెంపు - సుంకాలు

ద్వైపాక్షిక వాణిజ్య చర్చల నడుమ అమెరికా వస్తువుల దిగుమతిపై సుంకాల పెంపు గడువును పెంచింది భారత్​. ఏప్రిల్​ 1న అమలు కావాల్సిన సుంకాల పెంపు మే 2 వరకు వాయిదా వేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​, అమెరికా

By

Published : Mar 30, 2019, 4:56 PM IST

అమెరికాకు చెందిన 29 ఉత్పత్తుల దిగుమతిపై సుంకాల పెంపు గడువును మరోసారి పొడగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్​ 1న అమలు చేయాల్సిన సుంకాల పెంపు మే 2 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2018 జూన్​ నుంచి ఈ గడువు పొడిగించడం ఇది ఆరో సారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత్​ ఇలా గడువు పొడగిస్తూ వస్తోంది.

ఈ నెల ఆరంభంలో భారత్​కు అత్యంత ప్రాధాన్య హోదాను తొలగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 5.6 బిలియన్​ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది.

అందుకే ఇరు దేశాలు చర్చల ద్వారా వ్యాపారపరమైన సమస్యల పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా ఉక్కు, అల్యూమినియం సహా పలు ఇతర ఉత్పత్తులపై ఆంక్షలు సడలించాలని అమెరికాను కోరుతోంది భారత్. ఈ నేపథ్యంలో అమెరికా నిర్ణయం వెలువడే వరకు సుంకాల పెంపు గడువును పెంచింది.

ABOUT THE AUTHOR

...view details