అపరిచిత ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది ఆదాయపు పన్ను శాఖ(ఐటీ). ఇటీవల మోసపూరిత ఈ-మెయిల్స్‌తో సైబర్ మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది.
"పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించడండి! రీఫండ్ ఇస్తామంటూ వచ్చే తప్పుడు లింక్‌లపై క్లిక్ చేయకండి. అవన్నీ మోసపూరిత ఈ-మెయిళ్లు. మేము అలాంటి ఈ-మెయిల్స్ ఏవీ పంపలేదు." -ఐటీ శాఖ ట్వీట్