తెలంగాణ

telangana

ETV Bharat / business

విలాసాలు, అభరణాలు కాస్త చౌక - టీసీఎస్​

లగ్జరీ కార్లు, ఆభరణాల కొనుగోలుదార్లకు సీబీఐసీ ఊరటనిచ్చింది. జీఎస్​టీ మదింపు నుంచి ట్యాక్స్​ కలెక్షన్  ఎట్​ సోర్స్-టీసీఎస్​ను మినహాయిస్తూ ప్రకటన జారీ చేసింది.

జీఎస్​టీ

By

Published : Mar 10, 2019, 1:23 PM IST

లగ్జరీ కార్లు, ఆభరణాల కొనుగోలుపై 'టీసీఎస్​' (ట్యాక్స్​ కలెక్షన్​ ఎట్​ సోర్స్​)ను వస్తు సేవల పన్ను మదింపు నుంచి మినహాయిస్తున్నట్లు పరోక్ష పన్నులు, సుంకాల​ కేంద్ర బోర్డు-సీబీఐసీ ప్రకటించింది.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ.10 లక్షలకుపైగా విలువ కలిగిన వాహనాలు, రూ.5 లక్షలకుపైగా నగల కొనుగోళ్లు, రూ.2 లక్షలకుపైగా బులియన్ కొనుగోళ్లపై ఒక శాతం టీసీఎస్​ వర్తిస్తుంది.

టీసీఎస్​ నుంచి వచ్చే మొత్తన్ని జీఎస్​టీతో కలిపి వసూలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్​లో సీబీఐసీ ప్రకటించింది. అయితే పలు సంస్థల నుంచి కేంద్ర ప్రత్యక్ష వన్నుల బోర్డుకు అందిన అభ్యర్థనల మేరకు 'సీబీఐసీ' తాజా నిర్ణయం తీసుకుంది.

స్వాగతించిన సంస్థలు

"జీఎస్​టీ నుంచి టీసీఎస్ మినహాయిస్తూ సీబీఐసీ ఇచ్చిన స్పష్టత... వాహన సంస్థలకు కాస్త ఊరటనిచ్చే అంశం. జీఎస్​టీ ఇతర ఆదాయపన్నులు ఉండకూడదనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం"
-ఎర్నెస్ట్​ అండ్ యంగ్​ ప్రతినిధి అభిషేక్​ జైన్​

ABOUT THE AUTHOR

...view details