2020 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏకంగా లక్షా 15 వేల కోట్ల రూపాయలు వస్తు, సేవల పన్ను రూపంలో వచ్చాయి.
- మొత్తం జీఎస్టీ వసూళ్లు: రూ.1,15,174 కోట్లు
- కేంద్ర జీఎస్టీ: రూ.21,365 కోట్లు
- రాష్ట్ర జీఎస్టీ: రూ.27,804 కోట్లు
- ఐజీఎస్టీ: రూ.57,426 కోట్లు
- సెస్: రూ.8,579 కోట్లు(వస్తువుల ఎగుమతిపై వసూలైన రూ.971కోట్లతో కలిపి)