దేశంలోని 8 కీలక రంగాల్లో జులై నెలలో వృద్ధిరేటు మందగించింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల కారణంగా 8 కీలక రంగాల్లో వృద్ధి రేటు 2.1 శాతానికి పరిమితమైంది.
గత సంవత్సరం
గత ఏడాది జులైలో 8 కీలక రంగాల్లో 7.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. బొగ్గు, సహజవాయువు, ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌రంగాలు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా కలిగి ఉన్నాయి.