తెలంగాణ

telangana

ETV Bharat / business

'వేతనాల్లో మరింత పెరిగిన లింగ వివక్ష' - భారత్​

భారత్​లో వేతనాలకు సంబంధించి లింగ వివక్ష పెరిగినట్లు టైమ్స్​జాబ్స్​ సర్వే నివేదిక వెల్లడించింది. ఇది ఆరోగ్య రంగంలో ఎక్కువ ఉందని తెలిపింది. సర్వే ప్రకారం జీతాల్లో వ్యత్యాసం ఇంజినీర్లలో అత్యధికంగా ఉంది.

'వేతనాల్లో పెరిగిన లింగ వివక్ష '

By

Published : Apr 20, 2019, 2:02 PM IST

సంస్థలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ.. భారత్​లో వేతనాల విషయంలో లింగ వివక్ష పెరిగిందని టైమ్స్​జాబ్స్​ నిర్వహించిన సర్వేలో తేలింది. జనవరి నుంచి మార్చి మధ్య జరిగిన ఈ సర్వేలో 870 మంది ఉద్యోగులు పాల్గొనగా.. 60 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.

పురుషుల కంటే తక్కువ వేతనం పొందుతామనే భావనతోనే మహిళలు ఇంటర్వ్యూలకు వెళ్తారని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే 65 శాతం మంది పురుషులు మాత్రం మహిళలకూ సమాన వేతనం అందుతోందని చెప్పారు. మిగతా 35 మంది వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్ని రంగాల్లో మహిళల ఉత్పాదకత ప్రశ్నించదగినదిగా ఉందని 76 శాతం మంది తెలిపారు. 24 శాతం ఈ భావనతో విభేదించారు. సమాన వేతనం పొందలేకపోవటానికి పనిలో అనుభవమే కారణమని 41 శాతం మంది, లింగమే కారణమని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు.

భత్యాల్లోనూ వివక్షే...

వివక్ష కేవలం వేతనాలకే పరిమితం కాలేదు. భత్యాల్లోనూ వ్యత్యాసం ఉందని 29 శాతం మంది తెలిపారు.

మధ్యస్థాయిలో మేనేజ్​మెంట్​ వేతన వివక్ష ఎక్కువగా ఉందని 32 మంది అభిప్రాయపడ్డారు. ఇది సీనియర్​ స్థాయిలో అతితక్కువగా 15 శాతం ఉందని తెలిపారు.

ఆరోగ్య రంగంలోనే అత్యధికం

ఆరోగ్య రంగంలో వేతన వివక్ష ఎక్కువగా ఉందని సర్వే అంచనా వేసింది. తర్వాతి స్థానాల్లో ఐటీ, బ్యాంకింగ్​, ఫైనాన్స్​, ఆటోమొబైల్​ రంగాలున్నాయి.

ఎక్కువ వేతన వ్యత్యాసం ఇంజినీర్లలో ఉంది. జర్నలిస్టులు, ఫైనాన్స్​ అధికారులు, డాక్టర్లు, నర్సు ఉద్యోగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details