తెలంగాణ

telangana

ETV Bharat / business

కుదేలైన దేశానికి ఆర్థిక టీకా- ఏ రంగానికి ఎంత?

కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక రంగానికి చికిత్స చేసే లక్ష్యంతో ఈ ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మూల సూత్రంగా రూ.34.83 లక్షల కోట్లతో ఆర్థిక టీకా అందజేశారు. ఇందులో ఏ రంగానికి ఎంత మేర ఖర్చు చేయనున్నారో చూద్దాం.

rupee
బడ్జెట్ 2021

By

Published : Feb 1, 2021, 5:13 PM IST

Updated : Feb 1, 2021, 5:33 PM IST

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్​ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నేడు పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. అయితే ఏం రంగానికి ఎంత కేటాయించారు? ప్రభుత్వానికి అత్యధిక ఆదాయ వనరు ఏంటి? ప్రభుత్వం ఎక్కువగా ఏ రంగంపై ఖర్చు చేయబోతోంది? వంటి విషయాలను అంకెల రూపంలో తెలుసుకుందాం.

ఆదాయం ఇలా..

ప్రభుత్వానికి ఆదాయం ఇలా..
  1. ప్రతి రూపాయిలో 53 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా వస్తుంది
  2. 36 పైసలు.. అప్పులు, ఇతర రుణాలు
  3. పెట్టుబడుల ఉపసంహరణ సహా పన్నుయేతర ఆదాయం ద్వారా 6 పైసలు
  4. 5 పైసలు.. రుణ యేతర మూలధనం ద్వారా

తెలుసా..

  1. ప్రతి రూపాయిలో 15 పైసలు జీఎస్టీ రూపంలోనే వస్తుంది.
  2. కార్పొరేషన్​ పన్నుల ద్వారా 13 పైసలు చేరుతోంది.
  3. కేంద్ర ఎక్సైజ్​ సుంకం రూపంలో 8 పైసలు, కస్టమ్స్​ సుంకం ద్వారా 3 పైసలు వసూలు చేయనుంది.
  4. 14 పైసలు ఆదాయ పన్ను రూపేణా వస్తుంది.

ఖర్చు ఇలా...

ప్రభుత్వ వ్యయం ఇలా..
  • ప్రతి రూపాయికి 20 పైసల చొప్పున వడ్డీ చెల్లింపులు. ఇదే అతిపెద్ద వ్యయం.
  • రాష్ట్రాల పన్నులు, సుంకాల వాటా 16 పైసలు.
  • ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 8 పైసలు రక్షణ శాఖకు.
  • కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు 14 పైసలు.
  • కేంద్ర ప్రాయోజిత పథకాలకు 9 పైసలు.
  • ఫైనాన్స్​ కమిషన్, ఇతర లావాదేవీలకు 10 పైసలు.
  • రాయితీలు, పింఛనులకు వరుసగా 8, 5 పైసలు.
  • ఇతర ఖర్చులకు 10 పైసలు.
  • ఇదీ చూడండి:పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం

అంకెల రూపంలో బడ్జెట్..

మొత్తం బడ్జెట్​: రూ.34.83 లక్షల కోట్లు

బడ్డెట్​ రూపురేఖలు
  • ఆరోగ్య సంరక్షణపై పెట్టే ఖర్చును ఈ బడ్జెట్​లో 137 శాతం పెంచారు.
  • ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు.
  • రూ. 64,180 కోట్లతో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్​ భారత్​ స్వస్త్​ యోజన.
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు.
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.లక్షా 41వేల 678 కోట్లు.
  • కొవిడ్​ టీకా కోసం రూ. 35 వేల కోట్లు.
  • రైల్వేలకు లక్షా 10 వేల 55 కోట్లు.
  • 4 వేల 378 పట్టణ స్థానిక సంస్థలకు జలజీవన్‌ మిషన్‌ కింద రూ.2 లక్షల 87 వేల లక్షల కోట్లు.
  • స్వచ్ఛ భారత్‌ కోసం రూ. లక్షా 41 వేల 678 కోట్లు.
  • గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.40 వేల కోట్లు.
  • వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు రూ.40 వేల కోట్లు.
  • బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితి 74 శాతానికి పెంపు.
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీఎస్​యూ బ్యాంక్​లకు రూ. 20వేల కోట్లతో మూలధన సహాయం.
  • రూ. 20 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
  • ఆహారం, ఎరువులు, ఎల్‌పీజీ, కిరోసిన్లపై ప్రభుత్వ రాయితీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.96 లక్షల కోట్లు.
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం 5.54 లక్షల కోట్లకు పెంచారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4.39 లక్షల కోట్లుగా ఉంది.
  • దేశంలోనే మొదటి డిజిటల్ జనాభా లెక్కల కోసం రూ.3,726 కోట్లు.
  • 2021-22లో ప్రభుత్వం మార్కెట్ నుంచి రూ.12.05 లక్షల కోట్ల రుణం తీసుకోనుంది. ఇది అంచనా వేసిన రుణం కన్నా 64 శాతం ఎక్కువ.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.12.8 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ.
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో గత రుణాలకు చెల్లింపు కోసం రూ.2.80 లక్షల కోట్లు కేటాయించారు.
  • కరోనా వైరస్​పై పోరాటం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్​ నుంచి తీసుకునే రుణాలను 50 శాతానికి పైగా పెంచింది.
Last Updated : Feb 1, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details