తెలంగాణ

telangana

ETV Bharat / business

కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చినా ఐటీ రిటర్న్​ తప్పనిసరి! - పన్ను

ఆదాయ పన్ను దాఖలులో ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకువచ్చింది. ఇక ఆదాయం రూ.5 లక్షల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పన్ను రిటర్న్ దాఖలు చేయక తప్పదు. ఏడాదిలో రూ.2 లక్షలకు మించి విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేసినా, బ్యాంకు ఖాతాలో రూ.కోటి కన్నా ఎక్కువ డిపాజిట్​ అయినా, రూ.లక్ష కన్నా ఎక్కువ కరెంటు బిల్లు కట్టినా పన్ను రిటర్న్​ దాఖలు చేయాల్సిందే.

కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చినా ఐటీ రిటర్న్​ తప్పనిసరి!

By

Published : Jul 7, 2019, 2:45 PM IST

సాధారణంగా పరిమితులకు మించి ఆదాయం ఉంటేనే పన్ను దాఖలు చేస్తాం. కొన్ని విషయాల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినా... వారు పన్ను దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు.
అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్​ 139ని సవరించినట్లు వార్షిక బడ్జెట్​లో పేర్కొంది కేంద్రం. ఈ సవరణ ప్రకారం పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపితే పన్ను రిటర్న్​ దాఖలు చేయాలి.

ఈ సందర్భాల్లో...

  1. ఏడాదిలో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ. కోటి లేదా అంతకన్నా ఎక్కువ డబ్బులు జమ​ అయితే పన్ను రిటర్న్​ దాఖలు చేయాలి.
  2. విదేశాలకు వెళ్లేందుకు ఏడాదిలో రూ. 2 లక్షలకు మించి ఖర్చు చేస్తే పన్ను రిటర్న్​ దాఖలు తప్పనిసరి.
  3. విద్యుత్​ వినియోగ బిల్లు ఏడాదిలో రూ. లక్ష దాటినా పన్ను రిటర్న్​ తప్పదు.
  4. ఇళ్లు, బాండ్లపై పెట్టిన పెట్టుబడుల ద్వారా మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు తీసుకునే వారు ఇక పన్ను రిటర్న్​ సమర్పించాల్సిందే.

2020 ఏప్రిల్​ 1 నుంచి ఈ సవరణలు అమలులోకి రానున్నాయి.

డిజిటల్​ లావాదేవీలు పెంచడానికి...

నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్​ లావాదేవీలు పెంచడానికి ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా 194ఎన్ సెక్షన్​ను పొందుపరిచారు. ఈ సెక్షన్​ ప్రకారం రూ. కోటి కన్నా ఎక్కువ నగదు లావాదేవీ జరిపితే 2 శాతం టీడీఎస్​ పన్ను పడుతుంది.

ఈ సవరణ 2019 సెప్టెంబర్​ 1 నుంచి అమలులోకి రానుంది.​​

ABOUT THE AUTHOR

...view details