తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈపీఎఫ్​ ఖాతాల్లో ఈ నెలలోనే 8.5% వడ్డీ జమ!

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై నిర్ణయించిన 8.5 శాతం వడ్డీ రేటుపై ఈపీఎఫ్​ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 6 కోట్ల చందాదారులకు 8.5 శాతం వడ్డీని ఒకే విడతలో చెల్లించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

EPFO decision to pay the interest amount in one lump sum
ఏక మొత్తంలోనే ఈపీఎఫ్​ఓ వడ్డీ చెల్లింపు

By

Published : Dec 13, 2020, 12:13 PM IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఎఫ్​ఓ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి.. 8.5 శాతం వడ్డీని ఒకే విడతలో జమ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో ఈ నెలలోనే వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సెప్టెంబర్​లో 8.5 శాతం వడ్డీని.. 8.15 శాతంగా, 0.35 శాతంగా విభజించి రెండు విడతల్లో జమ చేయాలని నిర్ణయించింది కార్మిక శాఖ. కొన్ని పెట్టుబడులను ఉపసంహరించుకుని ఈ వడ్డీ మొత్తం చెల్లించాలని ఈపీఎఫ్​ఓ భావించింది. అయితే కరోనా వల్ల మార్కెట్లలో ఏర్పడిన అస్థిరతల కారణంగా ఇది సాధ్యం కాలేదు.

ప్రస్తుతం మార్కెట్లు ఆశించిన స్థాయికన్నా పెరిగి.. రికార్డు స్థాయిల వద్ద ఉన్న నేపథ్యంలో ఒకే విడతలో 8.5 శాతం వడ్డీ చెల్లించేందుకు ఈపీఎఫ్​ఓకు సమస్యలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి:స్టాక్‌ మార్కెట్లోకి నీరు!!

ABOUT THE AUTHOR

...view details