సమాజంలో మార్పుల వల్ల చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. ఉపాధి నిమిత్తం పిల్లలు ఇతర ప్రదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. జీవన ప్రమాణం వృద్ధి చెందింది. దీంతో పాటే జీవించే వ్యయం, వైద్య ఖర్చులు అంతకంతా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి పదవీ విరమణ తర్వాతా క్రమమైన ఆదాయం రావాల్సిన అవసరం ఉంది. ఇందుకు కొత్త పింఛను పథకం (ఎన్‌పీఎస్) చక్కని మార్గం. మరి ఎన్‌పీఎస్‌లో ఉండే వివిధ ఖాతాల గురించి వివరాలు తెలుసుకుందామా!
రెండు ఖాతాలు..
ఎన్‌పీఎస్‌లో టైర్ 1, టైర్ 2 ఖాతాలు అనె రెండు ఖాతాలు ఉంటాయి. టైర్ 1 ఖాతాలో నగదు జమచేయడం తప్పనిసరి. కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1.5లక్షలు జమచేయాలి. ఏడాదిలో కనీసం రూ.6వేలు జమచేయాలి లేకపోతే పెనాల్టీ విధిస్తారు. ఇందులోనూ రెండు రకాల పెట్టుబడి అవకాశాలున్నాయి. యాక్టివ్, ఆటో ఛాయిస్‌లు.
యాక్టివ్ ఛాయిస్ :
ఈక్విటీ, డెట్ ఫండ్లు, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో ఏయే నిష్పత్తుల్లో పెట్టుబడి పెట్టాలన్నది మదుపరి ఎంచుకోవచ్చు. ఐతే ఈక్విటీల్లో గరిష్ఠంగా 50శాతం, కనిష్ఠంగా 10శాతం ఉండేలా చూసుకోవాలి. మిగతావి ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో పెట్టవచ్చు.
ఆటో ఛాయిస్ :