తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక ప్రణాళిక ఇలా ఉంటే కరోనా కష్టాల్లోనూ బేఫికర్! - పెట్టుబడులతోపాటి అత్యవసర నిధి అవసరం ఎంత

ఎవరికైనా ఆర్థిక ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరుగుతుంటాయి. వాటన్నింటినీ సరైన ప్రణాళికతోనే ఎదుర్కోగలుగుతాం. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నాం. మరి సంక్షోభంలోనూ ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి, అత్యవసర నిధి అవసరమెంతో తెలిపే ప్రత్యేక కథనం మీ కోసం.

best financial planig
సంక్షోభంలో అండగా ఆర్థిక ప్రణాళిక

By

Published : May 2, 2020, 12:02 PM IST

పిట్ట కథ..

రవి, కిరణ్​ ఒకే ఆఫీసులో ఒకే హోదాలో పనిచేస్తున్నారు. ఇద్దరి వేతనాలూ సమానమే. ప్రస్తుతం లాక్​డౌన్​లో ఇద్దరి ఆదాయం తగ్గిపోయింది. ఈ కారణంగా కిరణ్​ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ... రవికి మాత్రం ఇలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే రవి ముందుగా ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధితో అవసరానికి డబ్బులు వాడుకుంటున్నారు. కిరణ్​కు అత్యవసర నిధి లేనందున వచ్చిన అరకొర ఆదాయమంతా ఖర్చులకే సరిపోతోంది.

లాక్​డౌన్​లోనూ పెట్టుబడులు..

ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్​కు ఖర్చులు పెరగటం వల్ల పెట్టుబడులు ఆపేశారు. కానీ రవి విషయంలో అలా కాదు. ఆయన అత్యవసర నిధిని ఖర్చు చేస్తూ.. తక్కువ ఆదాయం వచ్చినా పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నారు. రవి సరైన ఆర్థిక ప్రణాళిక పాటిస్తుండటం వల్ల కష్టకాలంలోనూ ఆర్థిక అండ లభించింది. కిరణ్​కు సరైన ఆర్థిక ప్రణాళిక లేక సంక్షోభంలో చిక్కుకున్నారు.

మరి రవి ఆర్థిక ప్రణాళిక ఎలా ప్రారంభమైంది? ఆయన ఎలాంటి ఆర్థిక సుత్రాలు పాటించారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రణాళిక అడుగులు ఇలా..

రవికి 2004లో మొదటి ఉద్యోగం వచ్చింది. రవి కూడా కొన్ని సంవత్సరాలు ఎలాంటి పొదుపు పెట్టుబడుల గురించి ఆలోచించకుండా. బయట తినటం, లగ్జరీ కొనుగోళ్ల వంటి వాటికి ఖర్చులు చేసేశారు. బాధ్యతలను తనపై వేసుకుని కుటుంబ పరిస్థితిని ఆర్థికంగా మెరుగు పరిచే పనిచేశారు. సోదరి పెళ్లి చేసేందుకు డబ్బులు పోగేయటం ప్రారంభించారు. 2009లో సోదరికి వివాహం అయింది. 2008 వరకు ఈక్విటీలలో కొంత మొత్తంలో పెట్టుబడులు ఉన్నప్పటికీ... అప్పుడు వచ్చిన ఆర్థిక సంక్షోభం తర్వాత వాటిని కొనసాగించలేదు. ఈ కారణాలన్నింటితో రవి దగ్గర డబ్బులు లేకుండా పోయాయి.

ఈ సమయంలో రవి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించటం మొదలు పెట్డారు. 2012లో పెళ్లి చేసుకుని విదేశానికి వెళ్లారు. విదేశాల్లో పొదుపు చేసినప్పటికీ వ్యవస్థీకృతంగా పెట్టుబడులు పెట్టటం లేదు. మళ్లీ ఈక్విటీలో పెట్టుబడి పెట్టటం ప్రారంభించారు. దీనితో పాటు కొంచెం మొత్తంలో జీవిత బీమా కూడా ఉంది. 2017లో ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు. అప్పుడు పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఆర్థిక ప్రణాళికల గురించి తెలుసుకుని.. కొన్ని రోజుల తరువాత ఓ ఫినాన్సియల్ అడ్వైజర్​ను సంప్రదించారు.

లక్ష్యాలు..

రవికి రిటైర్​మెంట్, పిల్లల పెళ్లిలు లాంటి లక్ష్యాలు ఉన్నాయి. కానీ వాటికి తగ్గట్లుగా పెట్టుబడులు లేవు. వీటికి ఎంత మొత్తం కావాల్సి ఉంటుందో ఫినాన్సియల్ అడ్వైజర్ గణించారు. ఎలాంటి అత్యవసర నిధి కూడా ఆయనకు లేదు. కంపెనీ ఇచ్చిన బీమా తప్ప వ్యక్తిగతంగా జీవిత బీమా, కుటుంబానికి ఆరోగ్య బీమా లేదు. దీనితో అత్యవసర నిధిని సమకూర్చుకోవాలని ఫినాన్సియల్ అడ్వైజర్ రవికి సూచించారు. అత్యవసర నిధి ఏర్పాటుతో పాటు జీవిత బీమా కవరేజ్ మొత్తాన్నీ పెంచుకున్నారు రవి.

రవికి ఈక్విటీల్లో స్మాల్​, మిడ్​ క్యాప్​లలో షేర్లు కూడా ఉన్నాయి. అయితే అవి నష్టాలనే మిగుల్చుతున్నాయి. ఇందుకోసం ఆర్థిక నిపుణుడి సలహా మేరకు వాటిలో నుంచి నిధులు ఉపసంహరించుకుని.. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం లాక్​డౌన్ వల్ల స్టాక్ మార్కెట్లు దాదాపు 30 శాతం వరకు పడిపోయాయి. ఆర్థిక నిపుణుడి సూచన మేరకు మూడు నుంచి ఆరు నెలల వరకు వీటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక వేసుకుంటున్నారు.

తొలి జీతం రావటం ప్రారంభమైనప్పటి నుంచే పెట్టుబడి పెట్టటం ప్రారంభించి ఉంటే.. ఇంకా మెరుగైన స్థాయిలో ఉండేవాడినని, మధ్యలో కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఉండేవి కావని రవి అంటున్నారు.

నిపుణుల మాట...

ఒకప్పుడు సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి కూడా ఆర్థిక ప్రణాళిక ఉన్నట్లయితే భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవటమే కాకుండా అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు తమ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక వేసుకుని క్లిష్ట సమయాల్లో సమస్యలు లేకుండా ఉండాలని ఫినాన్సియల్ అడ్వైజర్​లు సూచిస్తున్నారు. మొదటి ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పెట్టుబడులు ప్రారంభించాలని వారు సలహా ఇస్తున్నారు.

ఇదీ చూడండి:ఉద్యోగం కోల్పోతే బీమా హామీ ల‌భిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details