తెలంగాణ

telangana

ETV Bharat / business

నెలాఖరులో పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు? - latest budget summit

జనవరి 31నుంచి పార్లమెంటు​ బడ్జెట్​ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Budget meetings of parliament at the end of the january?
నెలాఖరులో పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు?

By

Published : Jan 4, 2020, 6:18 AM IST

Updated : Jan 4, 2020, 7:25 AM IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం త్వరలో సమావేశం కానున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ.. తుది తేదీలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

ఈ విషయంపై ఒకటి, రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు సుదీర్ఘంగా ఏప్రిల్ వరకు జరగనున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jan 4, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details