తెలంగాణ

telangana

ETV Bharat / business

జులైలో వాహన అమ్మకాలు అంతంతమాత్రంగానే

కరోనా ప్రభావం వాహన విక్రయాలపైనా తీవ్రంగా పడింది. జులై నెలలో అమ్మకాలు.. మిశ్రమంగా నమోదయ్యాయి. కొన్ని కంపెనీలు కాస్త కోలుకున్నా.. మరికొన్నింటిలో భారీ క్షీణత నమోదైంది. మారుతీ విక్రయాలు మొత్తంగా తగ్గినా.. దేశీయంగా మాత్రం కొంత పెరిగాయి. మహీంద్రా అండ్​ మహీంద్రా, టొయోటా కిర్లోస్కర్​ మోటార్​ అమ్మకాలు పడిపోయాయి.

Auto majors register negative growth in July
జులైలో వాహన అమ్మకాలు అంతంతమాత్రంగానే

By

Published : Aug 2, 2020, 10:01 AM IST

జులైలో వాహన విక్రయాలు మిశ్రమంగా నమోదయ్యాయి. కొన్ని కంపెనీల అమ్మకాలు కాస్త కోలుకోగా.. మరికొన్ని ఇంకా క్షీణత బాటలోనే పయనిస్తున్నాయి. మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు స్వల్పంగా తగ్గగా.. దేశీయ విక్రయాలు 1.3 శాతం పెరిగాయి. ఈ వాహన దిగ్గజం దేశీయంగా 1,01,307 వాహనాలను విక్రయించింది. చిన్న కార్లు ఆల్టో, ఎస్‌- ప్రెస్సో అమ్మకాలు 49.1 శాతం పెరిగి 11,577 వాహనాల నుంచి 17,258 వాహనాలకు చేరాయి. స్విఫ్ట్‌, సెలేరియో, ఇగ్నిస్‌ బాలెనో, డిజైర్‌ మోడళ్ల అమ్మకాలు 10.4 శాతం తగ్గి 51,529 వాహనాలకు పరిమితమయ్యాయి. అయితే విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎర్టిగా విక్రయాలు 26.3 శాతం వృద్ధితో 19,177 వాహనాలుగా నమోదుకావడం గమనార్హం.

జులైలో వాహన కంపెనీల విక్రయాలు

వీటిపై కరోనా ఎఫెక్ట్​..

హ్యుందాయ్‌ దేశీయ విక్రయాలు కూడా కేవలం 2 శాతం మాత్రమే తగ్గాయి. కొవిడ్‌-19 ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే వాహన పరిశ్రమ కోలుకుంటుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ అమ్మకాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. అయితే మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు 27 శాతం పెరిగి 25,402 వాహనాలుగా నమోదయ్యాయి. 2019 జులైలో మొత్తంగా 19,992 ట్రాక్టర్లను ఎంఅండ్‌ఎం విక్రయించింది.

ABOUT THE AUTHOR

...view details