వచ్చే ఆర్థిక సంవత్సర(2021-22) బడ్జెట్లో కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలు, అభివృద్ధి వ్యయాలకు.. పన్ను గణనలో 200 శాతం డిడక్షన్ ఇవ్వాలని పరిశ్రమల విభాగం అసోచామ్ ఆర్థిక శాఖను కోరింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 35 ద్వారా పొందే ప్రయోజనాలకోసం 'శాస్త్రీయ పరిశోధన'ల్లో కొవిడ్-19కి చెందిన అన్ని రకాల రీసెర్చ్లను చేర్చాలని సూచించింది అసోచామ్. ప్రస్తుతం సెక్షన్ 35 ద్వారా శాస్త్రీయ పరిశోధనల వ్యయాలకు 100 శాతం డిడక్షన్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక శాఖకు పంపిన ప్రీ బడ్జెట్ మెమొరాండమ్లో ఈ ఆంశాలను పేర్కొంది.